బిజీబిజీగా జనసేనాని.. నేడు ఒంగోలుకు పవన్!

  • ఊపిరి సలపని పర్యటనలతో బిజీబిజీ 
  • నేడు ఫెర్రీ ప్రమాద బాధితులకు పరామర్శ 
  • ప్రకాశం, నెల్లూరు జిల్లాల కార్యకర్తలతో మీటింగ్ 
జనసేనాని పవన్ కల్యాణ్ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. గత మూడు రోజులుగా పర్యటనలతో బిజీబిజీగా ఉన్న పవన్ నేడు ఒంగోలులో పర్యటించి ఫెర్రీఘాట్ పడవ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశం అవుతారు.

కాగా, పవన్ గత మూడు రోజులుగా ఊపిరి సలపని షెడ్యూల్‌తో ఉన్నారు. విశాఖపట్టణం, విజయవాడలలో పర్యటించిన ఆయన ప్రభుత్వం, ప్రతిపక్షంపై విమర్శల విల్లు ఎక్కుపెట్టి తూర్పారబడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

విజయవాడలో ఫాతిమా కాలేజీ విద్యార్థులను కలిసి అభయమిచ్చారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేయడంతోపాటు, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే జనసేన పార్టీ కార్యాలయం కోసం భూమిని ఇచ్చిన రైతులను కలిసి మాట్లాడారు.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Ongole

More Telugu News